HomeTelugu Big Storiesడిఫరెంట్‌ టైటిల్‌తో వెంకటేశ్‌.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్‌

డిఫరెంట్‌ టైటిల్‌తో వెంకటేశ్‌.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్‌

Glimpse Of SAINDHAV
1986 లో నటన ప్రారంభించిన విక్టరి వెంకటేశ్ విభిన్న జోనర్‌ల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తన 75వ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘హిట్ 2’తో డైరెక్టర్‌ శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ‘సైంధవ్’ అనే టైటిల్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. ఈ గ్లింప్స్‌ చాలా ఆసక్తికరంగా సాగింది. రఫ్ లుక్‌లో .. ఏకే 47 గన్ పట్టుకుని మరో చేతిలో క్యాప్సిల్ ని పట్టుకున్న వెంకటేష్‌ తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.

తన అభిమాన హీరోని మాస్‌ లుక్‌లో చూసిన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లింప్స్‌ బట్టి చూస్తుంటే ఈ సినిమా ఆయనకు ఓ మైలు రాయి అవుతుంది అనిపిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu