96 దర్శకుడికి విజయ్‌ సేతుపతి భారీ గిఫ్ట్‌..!

తమిళంలో 96 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఇది తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ అవుతోంది. తెలుగులో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. 96 తమిళ హీరో విజయ్ సేతుపతి దర్శకుడు ప్రేమ్ కుమార్ కు ఓ భారీ గిఫ్ట్ బహుమతిగా అందించాడు. రూ. 3 లక్షల విలువైన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను ప్రేమ్ కుమార్‌కు బహుమతి గా అందించాడు. అంతేకాదు, 0096 గా రిజిస్ట్రేషన్ చేయించి మరీ కానుకగా ఇచ్చాడట విజయ్. గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని కాదు.. అలా గుర్తుగా ఇవ్వడం ఆనందంగా ఉంటుంది కదూ.

CLICK HERE!! For the aha Latest Updates