ఆ హీరోపై అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా..?

సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ఆఖరి చిత్రం ‘గడ్డం గ్యాంగ్’. ఆ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ లోనే నిర్మించారు. అందులో సగమైనా.. సినిమా వసూలు చేసిందా..? అంటే అనుమానమే. సినిమా ఎప్పుడు విడుదలైందో.. ఎప్పుడు వెళ్ళిపోయిందో..? కూడా తెలియని పరిస్థితి. అలాంటిది ఆ హీరోని నమ్మి పాతిక కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తోన్న ‘గరుడ వేగ’ సినిమా మీద ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో కూడా ఆసక్తి పెరిగింది. దానికి కారణం దర్శకుడు ప్రవీణ్ సత్తారు.
సినిమా ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకోవడంతో నిర్మాత కాస్త ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. పెడితే పెట్టొచ్చు కానీ ఓ పది కోట్ల వరకు అయితే పర్వాలేదు కానీ ఏకంగా 25 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నామని నిర్మాత వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం రాజేశేఖర్ కు ఉన్న మార్కెట్ ను బట్టి పాతిక కోట్లు వసూలు చేయడం అనేది కష్టమే. రవితేజ లాంటి మాస్ హీరోలకు మాత్రమే ఆ రేంజ్ బడ్జెట్ వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఫేడవుట్ అయిన రాజశేఖర్ మీద ఏ నమ్మకంతో ఆ రేంజ్ బడ్జెట్ పెడుతున్నారో.. నిజంగానే అంత ఖర్చు పెట్టారా..? లేదా పబ్లిసిటీ కోసం అలా చెప్పి ఉంటారా..? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.