మహేష్ బాబు 26 వ సినిమా టైటిల్‌ ఫిక్స్‌!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 26 వ సినిమా రేపు లాంఛనంగా ప్రారంభం కాబోతున్నది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది. ఈ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు హాజరు కావడం లేదు. 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటె, మహేష్ బాబు 26 వ సినిమా కోసం అనేక టైటిల్స్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లో సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని సమాచారం. ఇదే పేరును రిజిస్టర్ చేయిస్తున్నారని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వరకు ఫస్ట్ కాపీని రెడీ చేసి సంక్రాంతికి విడుదల చేస్తారట. ఇందులో సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నది. ఈ పాత్ర గురించి రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.