HomeTelugu Trendingజబర్దస్త్‌ చలాకీ చంటికి గాయాలు

జబర్దస్త్‌ చలాకీ చంటికి గాయాలు

1 18బుల్లితెర హాస్యనటుడు చలాకీ చంటికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం చంటి కారులో హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయల్దేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో రాగానే చంటి ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంటికి స్వల్పగాయాలవ్వగా, కారు ముందు భాగం ధ్వంసమైంది. కోదాడ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న చంటి అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!