‘మా’లోని పేదలకు జీవిత, రాజశేఖర్ సహాయం


కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. మొత్తం ప్రజా రవాణా నిలిచిపోయింది. దీంతోపాటుగా సినిమా షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. దీని ప్రభావం పేద కళాకారులకు తీవ్ర ఇబ్బంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో కొంతమంది నిరుపేద కళాకారులు ఉన్నారు. వీరికి రోజూ పనిచేస్తేనే గాని పూట గడవదు. ఈ నెలాఖరు వరకు షూటింగ్‌లు లేకపోవడంతో అలాంటి పేదలు ఇబ్బంది పడకుండా వారికి సహాయం అందించాలని హీరో రాజశేఖర్, జీవిత దంపతులు ముందుకొచ్చారు. రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నిరుపేద కళాకారులకు 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించనున్నట్టు ప్రకటించారు.