HomeTelugu Trendingఇన్‌స్టాలో జ్యోతిక ఎంట్రీ.. అదుర్స్‌

ఇన్‌స్టాలో జ్యోతిక ఎంట్రీ.. అదుర్స్‌

Jyothika entry in instagram

స్టార్‌ హీరోయిన్, కోలీవుడ్‌ హీరో సూర్య భార్య జ్యోతిక ఇటీవ‌ల హిమాల‌య ప‌ర్వతా‌ల‌కు వెళ్లింది. అక్కడి ప్ర‌కృతి అందాల‌తో దిగిన ఫొటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ రోజు పోస్ట్ చేసింది. ఇన్‌స్టాలో ఆమె చేసిన తొలి పోస్ట్ ఇదే. “అందరికీ నమస్కారం! మొదటిసారిగా సోషల్ మీడియాలో! నా లాక్డౌన్ డైరీల నుండి కొన్ని ఫొటోలు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున హిమాలయాలలో, అందమైన కాశ్మీర్ గ్రేట్ లేక్స్, 70 కిమీ ట్రెక్, బికట్ అద్భుతమైన సాహసాల బృందంతో- రాహుల్, సచిన్, రౌల్, అశ్విన్, కాశ్మీర్ జట్టు ముస్తాక్ ఎన్ రియాజ్ భాయ్. మీకు ధన్యవాదములు. !! భారతదేశం చాలా అందంగా ఉంది! జై హింద్!” అంటూ పిక్స్ షేర్ చేసింది.

కాగా ఆమె ఆ పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. జ్యోతిక మొదటి పోస్ట్ కు దాదాపు 269,155 లైక్‌ల వర్షం కురిసింది. ఆమెకు సోషల్ మీడియాలోకి స్వాగతం చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!