కళ్యాణ్‌ రామ్‌ 17వచిత్రం ప్రకటించేశాడు

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తన 17వ చిత్రాని ప్రకటించేశారు. సతీశ్‌ వేగేష్న దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించనున్నారు. మెహరీన్‌ను హీరోయిన్‌ గా ఎంపికచేసుకున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. మార్చిలో విడులదైన ‘118’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు కల్యాణ్‌ రామ్‌. కేవీ గుహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.