HomeTelugu Trendingనా చెల్లిని కామెంట్‌ చేయడానికి తాప్సికి ఎంత ధైర్యం: కంగన సోదరి

నా చెల్లిని కామెంట్‌ చేయడానికి తాప్సికి ఎంత ధైర్యం: కంగన సోదరి

3 3బాలీవుడ్‌ హీరోయిన్‌ తాప్సిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ. కంగన నటించిన ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉందంటూ సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. తాప్సి కూడా ట్రైలర్‌ బాగుందంటూ ట్వీట్‌ చేశారు.

ఇందుకు రంగోలీ స్పందిస్తూ.. ‘కొంతమంది కంగనను కాపీ కొడుతూ బతికేస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి.. అలాంటివారు ట్రైలర్‌ను బాగుందని ప్రశంసించేటప్పుడు కనీసం కంగన పేరు కూడా ప్రస్తావించరు. ఓసారి తాప్సి కంగనను ఉద్దేశిస్తూ ఆమె ఓ అతివాది అని వ్యాఖ్యనించారు. తాప్సి.. ముందు మీరు ఇలా చీప్‌గా ఇతరుల వర్క్‌ను కాపీ కొట్టడం ఆపండి’ అని తిట్టిపోశారు.

దాంతో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కలగజేసుకుని రంగోలీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘రంగోలీ.. ఇది చాలా దూరం వెళుతోంది. నేను నీ సోదరి కంగనతో, తాప్సితో కలిసి పనిచేశాను. ట్రైలర్‌ను మెచ్చుకున్నారంటే.. అందులోని నటీనటులను కూడా మెచ్చుకున్నట్లే కదా?’ అని ప్రశ్నించారు.

ఇందుకు రంగోలీ ప్రతిస్పందిస్తూ.. ‘సర్‌.. కంగన పేరును ప్రస్తావించారా? లేదా? అన్నది ఇక్కడ విషయం కాదు. ఇప్పటివరకు ట్రైలర్‌ను మెచ్చుకున్నవారంతా కంగన గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ కంగనపై కామెంట్లు చేసిన వారితో నేను విసిగిపోయాను. కంగన ఓ అతివాది అనడానికి తాప్సికి ఎంత ధైర్యం. అసలు ఆమె ఎవరు నా సోదరిని పట్టుకుని అంత మాట అనడానికి? మీరు ఉదయం నుంచి కంగనకు ఫోన్లు చేస్తూ.. ‘నీకు తాప్సి పెద్ద ఫ్యాన్‌’ అని చెబుతున్నారు. తాప్సి ఆ మాట ఏ సందర్భంలో అన్నారో నిరూపిస్తారా? ఎప్పుడూ కంగనపై కామెంట్లు చేస్తూ ఉంటారావిడ’ అని మండిపడ్డారు రంగోలీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!