HomeTelugu Trendingప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Untitled 2
ప్రముఖ కన్నడ దర్శకుడు‌, సినీ నిర్మాత దినేష్‌ గాంధీ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన దినేష్‌ శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన దాదాపు పది సంవత్సరాలకు పైగా కన్నడ చిత్ర పరిశ్రమకు తన సేవలు అందించారు. దినేష్‌ వయస్సు 52 సంవత్సరాలు. ఈ రోజు బెంగుళూరులోని తన నివాసంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో దినేష్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. దినేష్‌ అకాల మరణం చిత్రపరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. దర్శకుడి మరణం పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!