అన్నయ్యతో కలిసి నటించాలనుంది!

కార్తీ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కాట్రు వెలియుదై’. ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది. తెలుగులో ‘చెలియా’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా కార్తీ మీడియాతో ముచ్చటించారు. ఈ సంధర్భంగా తన అన్నయ్య సూర్యతో కలిసి ఎప్పుడు నటిస్తారని ప్రశ్నించగా.. అన్నదమ్ములు ఒకే సమయంలో హీరోలుగా రాణించడం చాలా అరుదైన విషయమని అది మా విషయంలో జరగడం సంతోషంగా ఉందని అన్నారు.

అంతేకాదు తమ కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారని, తనకు కూడా అన్నయ్యతో కలిసి సినిమాలో నటించాలనుందని వెల్లడించారు. సరైన కథ దొరికితే ఖచ్చితంగా అన్నయ్యతో కలిసి నటిస్తానని అన్నారు. మరి ఈ మాటలు విన్న దర్శకులెవరైనా.. అటువంటి కథను సిద్ధం చేస్తారేమో.. చూడాలి!