తన పిల్లలకు ఆ లోటు ఉండకూడదు అంటున్న కత్రినా కైఫ్

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్.. తన పిల్లలకు తండ్రి లేని లోటు ఉండకూడదని అంటున్నారు‌. తన చిన్నప్పుడే కత్రినా తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోయారు. దాంతో చిన్నప్పటి నుంచి కత్రినా తండ్రి లేకుండానే పెరిగారు. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను తండ్రి లేకుండా పెరిగాను. కానీ భవిష్యత్తులో నా పిల్లలకు ఆ లోటు ఉండకూడదు. వారికి తల్లిదండ్రులతో కలిసి ఉంటే కలిగే అనుభూతి తెలియాలి. కానీ జీవితంలో తండ్రి లేనంత మాత్రాన ఓ ఆడపిల్ల అన్నీ కోల్పోయినట్లు కాదు. మేం ఏడుగురు తోబుట్టువులం. నేను చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని. అన్నీ నాలోనే దాచుకునేదాన్ని. అలాంటిది నేను నటిని ఎలా అయ్యానో నాకే తెలీడంలేదు’ అని వివరించారు.

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ‘భారత్‌’ సినిమా జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటానీ మరో కథానాయికగా నటించారు.

CLICK HERE!! For the aha Latest Updates