పవన్‌ కల్యాన్‌, క్రిష్‌ సినిమాలో కైరా అద్వాని.!

డైరెక్టర్‌ క్రిష్ ఈ సారి చారిత్రక నేపథ్యంతో కూడిన కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాను పవన్ కల్యాణ్ హీరోగా రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆంగ్లేయుల పరిపాలనా కాలంకంటే ముందుగా ఈ కథ నడుస్తుందని అంటున్నారు. పవన్ ఓ బందిపోటుగా కనిపించనున్నాడని చెబుతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కైరా అద్వాని పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆమెకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ పారితోషికాన్నే ఆఫర్ చేస్తున్నారట. బాలీవుడ్లో భారీ సినిమాలతో బిజీగా వున్న ఆమె, క్రిష్ సినిమాకి ఓకే చెబుతుందా? లేదా? అనేది చూడాలి. ఇక హరీశ్ శంకర్ తో పవన్ చేయనున్న సినిమాలో శృతి హాసన్ ను తీసుకుంటున్న సంగతి తెలిసిందే.