HomeTelugu Trendingప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాకి దిగ్గజ దర్శకుని గైడెన్స్..

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాకి దిగ్గజ దర్శకుని గైడెన్స్..

Legendary director for Prab‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకుణే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా గురించిన అప్డేట్‌ వచ్చింది. ఇప్పుడీ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ హెడ్ తరహాలో గైడెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.

ఈ రోజు దర్శకుడు పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని తెలియజేసింది. ‘మా చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరుతోంది. మా ఎపిక్ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన సృజనాత్మక శక్తులు మాకు కచ్చితంగా మార్గనిర్దేశం చేస్తాయి’ అంటూ వైజయంతీ మూవీస్ పోస్ట్ పెట్టింది. కాగా విచిత్ర సోదరులు’, ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ వంటి క్లాసిక్స్ అనదగ్గ పలు చిత్రాలను రూపొందించి టాలీవుడ్ చరిత్రలో ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు సింగీతం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!