విమెన్స్ డే స్పెషల్: సావిత్రి పిక్!

తెలుగు సినిమా చరిత్రలో సావిత్రి అనే పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె అన్ని రకాల పాత్రల్లో ప్రేక్షకులను అలరించింది. మహానటిగా పేరు గాంచింది. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో సంఘర్షణలు. అటువంటి ఆమె జీవితాన్ని కథగా సినిమా చేయాలని దర్శకుడు నాగశ్విన్ ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ సావిత్రి పోస్టర్ ను విమెన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ మహానటి సావిత్రిగా కనిపించనుంది. ఓ కీలకమైన పాత్రలో సమంతా కనిపించనుందని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఒక వైపున కీర్తి సురేష్.. మరో వైపున సమంతా.. మధ్యలో సావిత్రి ఫోటో మొత్తానికి ఈ పిక్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈరోజు ఎన్ని పోస్టర్స్ విడుదలైనా.. సరే సావిత్రి మాత్రం చాలా స్పెషల్,