పార్టీలో చిందులేసిన మహేశ్‌ హీరోయిన్‌

బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ పేరు వినగానే మనకు కియారా అద్వానీ గుర్తుకు వస్తుంది. ఈ సిరీస్ లో కియారా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇటు టాలీవుడ్ లో భరత్ అనే నేను సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కియారా రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కియారా కబీర్ సింగ్, అక్షయ్ తో గుడ్ న్యూస్ సినిమాల్లో నటిస్తుంది.

మన దగ్గర పార్టీ కల్చర్ తక్కువ. బాలీవుడ్ లో అలా కాదు.. చిన్న చిన్న అకేషన్స్ ను కూడా భారీ ఎత్తున నిర్వహిస్తారు. సెలెబ్రిలంతా ఒక చోట చేసి హంగామా చేస్తుంటారు. ఇలాంటి అకేషన్ ఒకటి రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగింది. సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా చిన్న పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, కియారా అద్వానీ, తారా సుతార, అనన్య పాండేలు హాజరయ్యారు. ఈ పార్టీలో కియారా అద్వానీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్టెప్స్ తో ఆకట్టుకుంది.