‘మేమ్‌ ఫేమస్‌’ పై మహేష్‌బాబు రివ్యూ

సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. స్వీయ రచనా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రేపు (మే 26)న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాయ్ బిస్కెట్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ ఈ సినిమాకు నిర్మాతలు. ఇందులో దాదాపు అందరూ కొత్తవారే. కాగా, ఈ సినిమాను విడుదలకు ముందు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వీక్షించారు.

అనంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా తన స్పందనను పంచుకున్నారు. “మేమ్ ఫేమస్ చిత్రాన్ని ఇప్పుడే చూశాను… బ్రిలియంట్ గా ఉంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాకు రచయిత, దర్శకుడు, హీరో అయిన సుమంత్ ప్రభాస్ గురించి చెప్పుకోవాలి… ఏం టాలెంట్! విజువల్స్ కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇతర విభాగాలు కానీ అన్నీ సరిగ్గా కుదిరాయి.

ఈ సినిమాలో చాలామంది కొత్తవాళ్లే అంటే నమ్మలేకపోతున్నాను. నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలకు, యువ చిత్రబృందానికి శుభాభినందనలు. ప్రతిభావంతులకు మద్దతుగా నిలిచినందుకు మీ పట్ల గర్విస్తున్నాను” అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates