ఇండియా వచ్చేసిన మహేష్‌ బాబు అందుకోసమేనా.!


సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సక్సెస్ ను ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు ఎంజాయ్ చేశాడు. ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లిన మహేష్‌ బాబు, మోకాలుకి శస్త్రచికిత్స చేయించుకుంటారనే వార్తలు వినిపించాయి. 5 నెలల విశ్రాంతి అనంతరమే ఆయన షూటింగులో పాల్గొంటారనే ప్రచారం కూడా జరిగింది.

అయితే ఫ్యామిలీతో కలిసి మహేష్‌ బాబు హైదరాబాద్ వచ్చేశాడు. ఆయన మోకాలు శస్త్ర చికిత్సకి సంబంధించిన ప్లానింగులో మార్పు ఏదైనా జరిగిందా అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. మహేష్‌ బాబు హైదరాబాద్ కి వచ్చేయడంతో, రేపో మాపో వంశీ పైడిపల్లి సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుందని అంటున్నారు. వచ్చేది వేసవి కనుక .. ఎండలను దృష్టిలో పెట్టుకునే షెడ్యూల్స్ ను ప్లాన్ చేయమని వంశీ పైడిపల్లితో మహేష్‌ చెప్పినట్టుగా అనుకుంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.