చెన్నై ప్రజలకు మంచు హీరో సాయం!

సినీ నటుడు, వైఎస్‌ఆర్సీపీ నేత మంచు మోహన్‌బాబు కుటుంబం ప్రకృతి విపత్తు సంబవించినప్పుడు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందే ఉంటారు. ముఖ్యంగా మంచు మనోజ్‌ వ్యక్తిగతంగా సహాయక చర్యల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతంలో హుదూద్‌ తుఫాను, చెన్నై వరదల సమయంలో వెంటనే స్పందించి తన వంతు సాయం అందించిన మనోజ్‌, తాజాగా చెన్నైలో ఏర్పడ్డ నీటి కష్టాలపై స్పందించారు.

తన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులతో కలిసి చెన్నైలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నారు. ‘తెలుగు ప్రజలకు అవసరమైనప్పుడు చెన్నై అన్ని రకాలుగా ఆదుకుంది. ఇప్పుడు మన సమయం వచ్చింది. దేశంలోనే ఆరవ అది పెద్ద నగరం ఇప్పుడు కనీస అవసరాలకు నీరు లేక ఇబ్బందుల్లో ఉంది. నేను నా వంతు సాయం చేస్తున్నారు. మీరు కూడా సాయం అందించండి’ అంటూ ట్వీట్ చేశాడు మంచు మనోజ్‌.