HomeTelugu Trending'కన్నప్ప'లో మంచు విష్ణుకి హీరోయిన్‌ దొరికేసింది

‘కన్నప్ప’లో మంచు విష్ణుకి హీరోయిన్‌ దొరికేసింది

manchu vishnu kannappa movi

టాలీవుడ్‌ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కన్నప్ప ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ మరో ప్రకటన చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ నటించనున్నారు. ఈ మేరకు టీంలోకి ఆమెను స్వాగతించింది కన్నప్ప చిత్రయూనిట్.

ప్రీతి నటించబోతున్న కీలక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఎన్నో రకాల ఆడిషన్స్ తరువాత ప్రీతిని సెలెక్ట్‌ చేశారు. విష్ణు మంచు, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి స్టార్‌ హీరోలు ఈ సినిమాలో నటించనున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి.. తన భరతనాట్య కళతో పాత్రకు ప్రాణం పోయనున్నారు.

కన్నప్ప లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్య నైపుణ్యం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ‘ప్రీతీకి ఇది తొలి సినిమా మాత్రమే కాదు.

కళ, సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి వచ్చింది. ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది’ అని అన్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!