కోడలితో కలిసి షూటింగ్‌ సరదాగా ఉందన్న నాగ్‌

అక్కినేని నాగార్జున హీరోగా మన్మథుడు-2 రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కోడలు సమంతతో కలిసి షూటింగ్‌లో పాల్గొనడం చాలా సరదాగా ఉందని అక్కినేని నాగార్జున అన్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌ హీరోయిన్‌. ఈ చిత్రంలో సమంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పోర్చుగల్‌లో షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. కాగా ఈ చిత్రం సెట్‌లో సమంతతో కలిసి దిగిన ఫొటోను నాగ్‌ మంగళవారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. మన్మథుడు-2 కోసం కోడలి పిల్ల సమంతతో కలిసి పనిచేయడం అద్భుతంగా, చాలా సరదాగా ఉంది. మరిన్ని ఫొటోలు విడుదల కాబోతున్నాయి అంటూ నాగ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన అన్నట్లే చిత్ర బృందం ఇవాళ ఈ సినిమా కొత్త స్టిల్స్‌ను విడుదల చేసింది.