మాజీ ముఖ్యమంత్రి మనమడుతో మెహ్రీన్‌ పెళ్లి


టాలీవుడ్‌లో నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బాగా రాజకీయ పలుకుబడి ఉన్న ఓ కుటుంబంలోకి కోడలిగా మెహ్రీన్‌ వెళ్లనుంది. హరియాణా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ పని చేశారు. మూడు పర్యాయాలు ఆయన సీఎంగా ఉన్నారు. అతడి మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్‌ వివాహం నిశ్చయమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడే భవ్య బిష్ణోయ్‌.

హర్యానాలో రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం వీరిది. పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలపడంతో మెహ్రీన్‌, భవ్య కలిసి తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కాగా వీరి నిశ్చితార్థం మార్చి 13వ తేదీన జరగనుంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్‌ వేదిక కానుంది. ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తోంది. ఎఫ్ 2, కవచం సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఎఫ్‌ 3’ సినిమాలో నటిస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates