శ్రీదేవి మరణంపై సీబీఐ ఎంక్వైరీ.. ఫ్యాన్స్‌ డిమెండ్‌


ద‌క్షిణాది, ఉత్త‌రాదిలో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీదేవి. అతిలోక సుందరి శ్రీదేవి జయంతి(ఆగస్ట్ 13) సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నటనలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన శ్రీదేవి రెండేళ్ల క్రితం దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బాత్‌టబ్‌లో చనిపోయారు. ఆమెమృతిపై చాలామంది అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి మరణంపై సీబీఐ విచారణ జరపాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి జయంతి సందర్బంగా #CBIEnquiryForSridevi అనే యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు. సుశాంత్ మరణం మాదిరిగానే శ్రీదేవి మరణంలోనూ కుట్ర కోణం దాగి ఉన్నట్టు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates