‘రాధే శ్యామ్‌’ న్యూ పోస్టర్‌


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్‌. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లిమ్స్‌ వీడియో అభిమానులను ఆకట్టుకుంది. ఈరోజు మహా శివరాత్రి సందర్బంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ ఆకాశం వైపు చూస్తున్న ఈ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates