HomeTelugu Trendingభార్య పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసిన నితిన్‌

భార్య పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసిన నితిన్‌

Nithin Wife Shalini Birthda
టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ తన భార్య షాలిని బర్త్ డే ఘనంగా సెలబ్రేట్ చేశాడు. పెళ్లి తర్వాత వచ్చిన తన భార్యామణి పుట్టినరోజుని క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి జరిపినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి హాస్యనటుడు వెన్నెల కిషోర్ – ‘భీష్మ’ డైరెక్టర్‌ వంశీ కుడుముల కూడా హాజరయ్యారు. వెన్నెల కిషోర్ దీనికి సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ షాలిని కి బర్త్ డే విషెస్ తెలియజేశాడు. ఇందులో నితిన్ – షాలిని దంపతులతో పాటు వెన్నెల కిషోర్ – వంశీ కుడుముల కనిపిస్తున్నారు.

ఇంతకముందు నితిన్ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘నా లవ్లీ వైఫ్ కి బర్త్ డే విషెస్.. నేను నీతో గడిపిన సమయాలు నా రోజులోని సంతోషకరమైన క్షణాలు’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి తన సతీమణితో కలసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇక సినిమాల విషయానికొస్తే నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ‘చెక్’ అనే సినిమా చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!