పార్టీ నాయకులతో పవన్‌కల్యాణ్‌ భేటీ

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురువారం ఆ పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం వివిధ జిల్లాలకు చెందిన నాయకులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పవన్‌ సోదరుడు, నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన నాగబాబు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓటమి సహా, పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ.. ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి? పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో పవన్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది.