హాట్‌టాపిక్‌గా పవన్‌ కళ్యాణ్‌ రెమ్యునరేషన్‌


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ క్రేజ్‌ అటు సినిమాలతో ఇటు పొలిటికల్‌గాను బిజీగా ఉన్నాడు. హీరోగా ఆయనకు ఉన్న ప్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నిర్మాతలు సైతం పవన్‌కు ఎంత రెమ్యునరేషన్‌ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాగా తాజాగా పవన్‌ తన రెమ్యునరేషన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

తాజాగా ఏర్పాటు చేసిన జనసేన పదవ ఆవిర్భావి దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 1000 కోట్ల ప్యాకేజీ పవన్ కోసం పంపించాలని ఏపీలో కలిసి పని చేద్దాం అనేది ఆ ప్యాకేజీ సారాంశం అని కథనంలో పేర్కొన్నారు.

డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదని, తనకు డబ్బులు అవసరం లేదని, అవసరం అయితే డబ్బులు ఇస్తానని పవన్‌ ఆ సభలో వెల్లడించాడు. ఈ రోజు ధైర్యంగా చెబుతున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాకు 22 రోజులు కాల్షీట్లు ఇచ్చాను. ఆ సినిమాకు నేను తీసుకునే డబ్బు రోజుకు రెండు కోట్లు. ఇరవై రోజులు పని చేస్తే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను. ప్రతి సినిమాకు అంత డబ్బు ఇస్తారని నేను చెప్పను. కానీ, నా యావరేజ్ స్థాయి అది. అది మీరు ఇచ్చిన స్థాయి. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి. నాకు డబ్బులు అవసరం ఏముంది? నేను సంపాదించుకోలేని డబ్బులా? అని పవన్ జనసేన సభలో చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్‌ చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. కాగా గతకొన్ని రోజులుగా ఈ సినిమాకు పవన్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ గురించి సోషల్‌ మీడియాలో చర్చలు నడుస్తుంది.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates