డ్రంక్ అండ్ డ్రైవ్ లో పూజా హెగ్డే?

ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం నేరం అని తెలిసినా చాలామంది తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ కు గురవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా దొరికిపోతుంటారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే మేనేజర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడనే వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.

మే 1 వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక తరువాత పూజా హెగ్డే, ఆమె స్నేహితులు, మేనేజర్ తో కలిసి ప్రైవేట్ పార్టీలో పాల్గొనేందుకు వెళ్లారని, అప్పటికే హెగ్డే మేనేజర్ డ్రింక్ చేసి ఉన్నాడని, ఆ సమయంలో పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికారని వార్తలు వస్తున్నాయి. కారుకు అక్కడే వదిలేసి పూజా అండ్ కో వేరే కారులో వెళ్లిపోయారని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని, వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates