HomeTelugu Trendingఐక్యరాజ్యసమితి అధికారులతో .. పూనమ్ కౌర్ గాంధీగిరి

ఐక్యరాజ్యసమితి అధికారులతో .. పూనమ్ కౌర్ గాంధీగిరి

11 1హాట్‌ బ్యూటీ పూనమ్ కౌర్.. పవన్ కళ్యాణ్ వివాదాలతో బాగానే పాపులర్ అయింది. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలు కూడా బాగానే చేస్తుంటుంది ఈ భామ. ఇక ఇప్పుడు ఏకంగా ఇండియా తరఫున జాతిపిత గొప్పతనాన్ని మాట్లాడటానికి వెళ్లింది. మహాత్మాగాంధీ ప్రబోధించిన శాంతి, అహింస మార్గంలో ఈ భామ కూడా ప్రయాణిస్తుంది. జీవితంలో శాంతి, అహింస మార్గాన్ని ఆమె బలంగా విశ్వసిస్తుంది. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని ఆమె సందర్శించింది. అక్కడి అధికారులను కలిసి గాంధీజీ శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రత్యేక చిత్రపటాలను అందించింది ఈమె.

అధికారులతో కలిసి గాంధీజీ 150వ జయంతిని సెలబ్రేట్ చేసుకుంది పూనమ్. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గారికి గాంధీజీ చిత్రపటాన్ని శాంతి సందేశంగా అదించింది ఈమె. అలాగే, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో భారత రాయబారి సందీప్ చక్రవర్తిని కలిశారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ వ్యవహారాలు చూసే డిప్యూటీ రిప్రజెంటేటివ్ నాగరాజ్ నాయుడుతో పూనమ్ కౌర్ సమావేశమైంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ “మహాత్ముని 150వ జయంతి రోజున ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత ప్రతినిధులతో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. సంప్రదాయ కళలు వర్లీ, కలంకారి, మధుబని పద్ధతుల్లో రూపొందించిన గాంధీజీ చిత్రపటాన్ని సయ్యద్ అక్బరుద్దీన్ గారికి అందించాను. ఉన్నతాధికారుల ద్వారా గాంధీజీ గారి ఫస్ట్ పెయింటింగ్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందజేశాను. ప్రతిరోజు, ప్రతి ఒక్కరి జీవితంలో, మన ఈ ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే ఏం చేస్తే బావుంటుంది అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచనలను అక్బరుద్దీన్ గారితో పంచుకున్నాను. ప్రశాంతంగా ప్రతి విషయాన్ని ఆయన విన్నారు.

మహాత్మ గాంధీ అనుసరించిన శాంతి మార్గమే మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. జీవితంలో ఆయన నమ్మిన సూత్రాలు, పాటించిన విధానాలు ‌ ఆయన మహాత్ముని చేశాయని నేను నమ్ముతాను. ఆయన జీవన విధానం ప్రతి ఒక్కరూ ఆచరించదగినది. జీవితంలో ప్రతి ఒక్కరికి శాంతి లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. శాంతి, ప్రేమ, మానవత్వంతో ప్రజలందరూ జీవించాలని కోరుకుంటున్నాను. ఈ సందేశం అందరికీ చేరుతుందని ఆశిస్తున్నాను. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేయడం లేదు. నా వంతు సామాజిక బాధ్యతగా ‌చేస్తున్నాను” అన్నారు. మొత్తానికి పూనమ్ చేసిన ఈ పనితో సోషల్ మీడియాలో ఆమె ఇమేజ్ మరింత పెరిగిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!