కొత్త బిజినెస్‌తో ప్రభాస్‌..!

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ షూట్ చేస్తూనే మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా పనులు కూడ చూసుకుంటున్నాడు. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి. తాజా సమాచారం మేరకు రాధాకృష్ణ సినిమాలో ప్రభాస్ వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపిస్తాడట. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది. 1960 నేపథ్యంలో జరగనున్న ఈ సినిమా పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది