HomeTelugu Big Stories'రాధేశ్యామ్‌' టీజర్‌ వచ్చేసింది

‘రాధేశ్యామ్‌’ టీజర్‌ వచ్చేసింది

prabhas radheshyam teaser oనేడు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రభాస్‌ హీరోగా రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్ర పోషించారు. ఈ టీజర్ లో లవర్‌బాయ్‌గా ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సన్నివేశాలకు అనుగుణంగా జస్టిన్‌ ప్రభాకరణ్‌ అందించిన సంగీతం సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తున్నాయి.

చాలాకాలం నుంచి ఈ టీజర్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం ‘రాధేశ్యామ్’ టీజర్ మంచి ట్రీట్ ను ఇచ్చింది. ముందుగా చెప్పినట్టుగానే విక్రమాదిత్య ఎవరు ? అనే విషయాన్నీ ప్రపంచానికి ‘రాధే శ్యామ్’ టీజర్ తో తెలియజేశారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం 2022 జనవరి 14న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!