HomeTelugu Trendingడైరెక్టర్‌తో నటుడు ప్రభు కూతురి పెళ్లి..!

డైరెక్టర్‌తో నటుడు ప్రభు కూతురి పెళ్లి..!

Prabhu daughter marriage

నటుడు ప్రభు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడు ప్రభు తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేశాడు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ప్రభుకు ఇద్దరు పిల్లలు. కొడుకు విక్రం ప్రభు ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలు చేస్తున్నాడు. కూతురు ఐశ్వర్యా ప్రభు.

ఐశ్వర్యా ప్రభుకు తమ దగ్గరి బంధువు కునాల్‌తో 2009లో వివాహం జరిపించారు. ఆ తర్వాత భర్తతో విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఐశ్వర్య తండ్రి వద్దే ఉంటోంది.

ఐశ్వర్య సోదరుడు విక్రమ్ హీరోగా వచ్చిన ఇరుకప్పపుట్టు మూవీ షూటింగ్ సమయంలో ఐశ్వర్య అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లడంతో ఆ సినిమా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.

ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమ గురించి ఐశ్వర్య ఇంట్లో కూడా చెప్పి ఒప్పించిందట. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం.

ప్రభు కూడా వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. డైరెక్టర్ రవిచంద్రన్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారట. ఇరుకుటుంబాలు కలిసి ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’. విశాల్, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. అంతకు ముందు తమిళంలో జీవీ ప్రకాష్ కుమార్, శింబు, ప్రభుదేవా హీరోలుగా సినిమాలు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!