
Laila box office collections:
విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ ఫిబ్రవరి 14న విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో, కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. కానీ నిర్మాత సాహు గరపాటి వారం చివరికి వసూళ్లు మెరుగుపడతాయని ఆశించారు. కానీ ఆ అంచనాలు అసలు నెరవేరలేదు.
సినిమా రివ్యూస్ చూసినవారికి అసలు థియేటర్‌కి వెళ్లాలనే ఉత్సాహమే రాలేదు. కొన్ని ప్రాంతాల్లో 50% థియేటర్లకు బుకింగ్స్ లేకపోవడం గమనార్హం. మిగిలిన షోలలో కూడా ప్రేక్షకులు తక్కువగానే కనిపించారు. అశ్లీలమైన హాస్యం, బోరింగ్ కథనంతో సినిమా విమర్శకుల నుండి 1 లేదా 1.5 రేటింగ్ మాత్రమే పొందింది.
విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ సినిమా వల్ల నిర్మాతకు రూ. 6 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా కొంత రికవరీ చేసినా, థియేట్రికల్ రన్ పూర్తిగా డిజాస్టర్ అనే చెప్పాలి. విశ్వక్ సేన్ సినిమాకు ఈ స్థాయి ఫలితం రావడం నిజంగా అయోమయం.
ఈ సినిమా ఫలితంతో విశ్వక్ సేన్ కెరీర్‌పై కూడా నెగటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది. కంటెంట్ సెలక్షన్ విషయంలో ఇకపై చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ALSO READ: Pawan Kalyan రియల్ లైఫ్ మూమెంట్ ను సినిమాలో పెట్టేసిన హరీష్ శంకర్