HomeTelugu Trendingగోపీచంద్‌తో రాధాకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్

గోపీచంద్‌తో రాధాకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్

Gopichand movie with Radhakగోపీచంద్ ‘జిల్’ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాధా కృష్ణ కుమార్. ఆ తర్వాత ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో భారీ అంచనాలతో తెరకెక్కించిన రాధేశ్యామ్ మూవీ ఆశించినంత విజయం సాధించలేకపోయింది.

తాజాగా గోపీచంద్‌తో మరో సినిమా చేయడానికి రాధా కృష్ణ కుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటివలే గోపీచంద్‌కు ఓ కథ చెప్పాడట రాధాకృష్ణ. సివిల్ వార్ బ్యాక్ డ్రాప్‌లో వుండే ఈ కథ గోపీచంద్‌కి నచ్చిందట. రాధా కృష్ణతో కలిసి గత రెండు చిత్రాలను నిర్మించిన యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గోపీచంద్ భీమా చిత్రం షూటింగ్‌లో ఉన్నాడు. ఈ చిత్రాన్ని కన్నడ డైరెక్టర్ ఏ హర్ష తెరకెక్కిస్తున్నాడు. దీంతోపాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాధా కృష్ణ కుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది. తర్వలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!