HomeTelugu Trendingనేను తాగి గొడవ చేయలేదు.. ఓ మూర్ఖుడు సృష్టించిన కథ అది: రాజేంద్రప్రసాద్‌

నేను తాగి గొడవ చేయలేదు.. ఓ మూర్ఖుడు సృష్టించిన కథ అది: రాజేంద్రప్రసాద్‌

2నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఓ బేబీ’ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో సమంత టైటిల్‌ పాత్రలో నటించారు.అయితే ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ తాగే సన్నివేశంలో నటించేందుకు సెట్‌లో నిజంగానే మద్యం సేవించి గొడవ చేశారని, దాంతో సెట్లోని నటీమణులు అసౌకర్యానికి గురయ్యారని తప్పుడు వార్తలు వచ్చాయి.

దీనికి సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి శనివారం జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజేంద్రప్రసాద్‌ స్పందించారు. ‘నేను చదువుకున్న నటుడిని. నేను సీనియర్‌ ఎన్టీఆర్‌లాగా పాత్రలో లీనమైపోయి నటిస్తుంటాను. ఎందుకంటే నన్ను ఇండస్ట్రీకు పరిచయం చేసింది ఆయనే. ఆయన ఓ పాత్రలో నటిస్తున్నప్పుడు ఇంటికి వెళ్లేవరకు అదే పాత్రలో లీనమైపోయి ఉంటారు. బహుశా నాకూ అదే అలవడినట్లుంది. ఈ నేపథ్యంలో ‘ఓ బేబీ’ సినిమాలో తాగినట్లు నటించాల్సిన సన్నివేశం ఒకటి వచ్చింది. ఇందుకోసం నేను షాట్‌ రెడీ అని చెప్పడానికి ముందే మద్యం సేవించినట్లుగా నటించాను. దీనిపై ఎవడో మూర్ఖుడు తప్పుగా రాశాడు. విషయం తెలుసుకోకుండా అలా రాశాడు.. అది వాడి ఖర్మ. ఎవరేమనుకుంటే నాకేంటి.. నా నటన వల్ల సెట్లోని ఎవ్వరికీ ఇబ్బందికలగలేదని నేను కచ్చితంగా చెప్పగలను’ అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!