HomeTelugu Trendingఅల్లుడి డైరెక్షన్‌లో రజనీకాంత్‌!

అల్లుడి డైరెక్షన్‌లో రజనీకాంత్‌!

Rajinikanth movie in Dhanus

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ డైరెక్షన్‌లో చేస్తున్న ‘అన్నాత్తె’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. కాగా ఇటీవలే సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేంద్రం అమెరికా వెళ్ళిన సంగ‌తి తెలిసిందే. రజనీకాంత్ శుక్రవారం చెన్నైకి తిరిగొచ్చారు. ఇక ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌లో త‌న కూతురు సౌందర్య డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌నున్నాడంటూ కొద్ది రోజులుగా ప్ర‌చారం న‌డుస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌జ‌నీకాంత్ చేసే చివ‌రి చిత్రం అల్లుడు ధ‌నుష్ డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని ర‌జ‌నీకాంత్ కూతుళ్లు ఐశ్వ‌ర్య‌, సౌంద‌ర్య నిర్మించ‌నున్నార‌ట‌. ర‌జ‌నీకాంత్ 170వ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొంద‌నుంది.

అయితే ధనుష్ ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ధనుష్ ఇంతకముందు రజినీ నటించిన ‘కాలా’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజినీ తో ‘చంద్రముఖి 2’ సినిమా చేయాలని దర్శకుడు పి. వాసు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. రజినీ వీరాభిమాని రాఘవ లారెన్స్ కూడా ఈ సీక్వెల్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. పి.వాసు – సూపర్ స్టార్ కాంబోలో రాబోయే ‘చంద్రముఖి 2’ సినిమాలో నటిస్తున్నానంటూ లారెన్స్ వెల్లడించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కాలానిథి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని పేర్కొన్నాడు. అయితే రజినీ ఏ సినిమా ముందు సెట్స్ పైకి తీసుకెళ్లాడు అనే దానిపై స్పష్టత లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!