లారెన్స్ దర్శకత్వంలో హీరోగా రకుల్ సోదరుడు ఎంట్రీ

టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ కంటే కోలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో తన తమ్ముడు అమన్‌ను ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తోంది. రాజానే ఫిలిం కార్పోరేషన్‌ నిర్మాణంలో అమన్ హీరోగా దాసరి లారెన్స్ దర్శకత్వంలోని సినిమా రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంచ్ కాబోతున్నది.

రేపు ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలతో సినిమా లాంచ్ చేస్తున్నారు. రజిని ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మిగతా నటీనటుల వివరాలను రేపు ప్రకటించే అవకాశం ఉంది.