HomeTelugu Trendingఅతిపెద్ద థియేటర్‌ను లాంచ్‌ చేసిన చెర్రీ‌.. 'సాహో' ఇందులోనే..

అతిపెద్ద థియేటర్‌ను లాంచ్‌ చేసిన చెర్రీ‌.. ‘సాహో’ ఇందులోనే..

6 27ఇండియాలోనే అతిపెద్ద సినిమా తెరను టాలీవుడ్‌ నటుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గురువారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు దగ్గర్లో దేశంలోనే అతిపెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను నిర్మించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ రూ.40 కోట్లతో పిండిపాళెంలో ఈ థియేటర్‌ను నిర్మించింది. రామ్‌చరణ్‌ ప్రారంభించిన ఈ థియేటర్‌లో ఈ నెల 30న ‘సాహో’ సినిమాను ప్రదర్శించనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన తెర, 656 సీట్ల సామర్థ్యంతో 3డీ సౌండ్‌ సిస్టమ్‌తో థియేటర్‌ను నిర్మించారు. ఇలాంటి థియేటర్లు ఆసియా ఖండంలో మరో రెండు ఉన్నాయి.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌ తార ఆలియాభట్‌ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!