HomeTelugu Trendingనరేష్‌ ఇంట్లోకి రమ్య రఘుపతి రావొద్దని కోర్టు ఆదేశం

నరేష్‌ ఇంట్లోకి రమ్య రఘుపతి రావొద్దని కోర్టు ఆదేశం

Naresh Malli pelli
సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేశ్ జంటగా రూపొందించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాను వ్యతిరేకిస్తూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వేసిన పిటిషన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. తన వ్యక్తిగత జీవితాన్ని పోలి ఉందని, తనను ఈ సినిమాలో టార్గెట్ చేశారని ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టును కోరారు.

మళ్లీ పెళ్లి సినిమాపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మెరిట్ లేని కారణంగా రమ్య రఘుపతి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సెన్సార్ బోర్డు చెప్పినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు పేర్కొంది. అలాగే సెన్సార్ బోర్డు ఒక చిత్రాన్ని కల్పితమని సర్టిఫై చేస్తే దాని విడుదలను ప్రయివేటు వ్యక్తులు అడ్డుకోలేరని కోర్టు స్పష్టం చేసింది.

నరేష్ కుటుంబానికి చెందిన మరో కేసులోనూ కోర్టు తీర్పు వెలువడింది. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని నరేష్ ఇంట్లోకి ఆయన భార్య రమ్యరఘుపతిని రాకుండా చూడాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు గతంలో కోర్టులో దావా వేశారు. కేసును విచారించిన కోర్టు నరేశ్ ఇంట్లోకి రమ్య రాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.

నరేశ్, ఆయన మూడో భార్య రమ్యరఘుపతి కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కొంతకాలంగా నటి పవిత్రా లోకేశ్‌తో నరేశ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో నరేశ్ సన్నిహితంగా ఉండటాన్ని రమ్య ప్రశ్నించారు. మీడియా ముందుకూ వచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!