బిగ్‌బాస్‌ హోస్ట్‌కి పారితోషికం ఎంతో తెలుసా?


ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-13 కోసం సల్మాన్‌ ఖాన్‌ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.403 కోట్లు కావాలని అడిగారట. ఈ మేరకు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ షోలో మొత్తం 26 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్‌కు సల్మాన్‌ రూ. 31 కోట్లు
అడిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన హిందీ ‘బిగ్‌బాస్‌’ షోకు ఇప్పటివరకు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తూ వచ్చారు.

ఆయన స్థానాన్ని మరొకరితో భర్తీ చేయలేక నిర్వాహకులు సల్మాన్‌ అడిగినంత పారితోషికాన్ని ఇచ్చేందుకు ఒప్పుకొన్నారట. ఇదే నిజమైతే ఓ టీవీ షో కోసం అత్యధిక మొత్తంలో నగదు తీసుకున్న ఏకైక భారతీయ సెలబ్రిటీ సల్మాన్‌ ఖానే అవుతారు. సెప్టెంబర్‌ 29 నుంచి “బిగ్‌బాస్ సీజన్‌-13 ప్రారంభం అవుతుంది. 2020 జనవరి 10న
ప్రసారమయ్యే గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమంతో ముగుస్తుంది.