HomeTelugu Trendingహీరోయిన్లతో ఆర్జీవీ రొమాన్స్.. ఫొటో వైరల్

హీరోయిన్లతో ఆర్జీవీ రొమాన్స్.. ఫొటో వైరల్

RGV Kiss to Heroine
వివాదాలకు కేరాఫ్ అంటే ఆర్జీవీ. ఆయన బోల్డ్ కామెంట్లు ఎంతటి వివాదానికి దారితీస్తుంటాయో అందరికీ తెలిసిందే. అందమైన యాంకర్లు ఆయన కంటపడితే మాటలు హద్దులు దాటుతాయి. కొందరైతే అలాంటి విషయాల్లో ఆర్జీవీని కదిలించి ఫేమస్ అవుతుంటారు. వర్మ తాజాగా తన మకాంను గోవాకు మార్చేశారు. అక్కడే షూటింగ్‌లు చేసుకుంటూ హీరోయిన్లతో కాలక్షేపం చేసేస్తున్నాడు. వర్మ కాంపౌండ్‌లో నైనా గంగూలీ, అప్సర రాణి వంటి వారంతా ఉన్నారు. ఇప్పటికే వీరితో అనేక రకాల సినిమాలను తీశాడు. ఇప్పుడు లెస్బియన్ అంటూ వేడిపుట్టించేందుకు వర్మ తన స్టైల్లో రాబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

వర్మ చిత్రాలు దిశ, కరోనా వైరస్ సినిమాల్లో హీరోయిన్‌గా సోనియా నటించింది. హీరోయిన్లతో వర్మ ఎంత సన్నిహితంగా ఉంటాడో తెలిసిందే. ఆ హీరోయిన్ సోనియా తొడలపై ముద్దులు పెడుతుండగా మరో హీరోయిన్ నైనా గంగూలి ఆ ఫోటోను తీసిందట. వర్మ ఆ ఫొటోను షేర్ చేశారు. ఆమె అద్భుతంగా నటించడమే కాదు ఫొటోలు తీసే ప్రతిభ కూడా ఉందంటూ వర్మ కామెంట్ పెట్టేశారు. హీరోయిన్ టాలెంట్‌ను పొగుడుతూ వర్మ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu