HomeTelugu Big Storiesపవర్‌స్టార్‌పై ఆర్జీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ

పవర్‌స్టార్‌పై ఆర్జీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ

RGV special interview on Po

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పవర్‌ స్టార్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే టీజర్‌కూడా విడుదల చేశాడు వర్మ. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వర్మపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్లాప్‌బోర్డ్‌ కు ఆర్జీవీ ఇంటర్యూ ఇచ్చారు. పవర్‌స్టార్ సినిమాపై తనదైన స్టైల్లోనే సమాధానం చెప్పారు. ముందుగా చెప్పినట్లుగానే పవర్‌ స్టార్‌ సినిమా కేవలం కల్పితం మాత్రమే అని చెప్పాడు. సినిమాలో జరిగే ప్రతి సన్నివేశం ఫిక్షన్‌.. ఇందులో ఎవరి పాత్రలకు అయినా మ్యాచ్ అయితే అది యాదృచ్ఛికం. ఈ సినిమా రిలీజయిన తర్వాత పవన్‌, చిరంజీవిగాని ఎవరైనా నన్ను ప్రశ్నించినా ఇదే చెబుతా అన్నాడు.

ట్రైలర్‌ లీక్‌ గురించి మాట్లాడుతూ.. ఫైరసీ అనేది కామన్‌.. దానిపై యాక్షన్‌ తీసుకున్నా ఫలితం ఉండదు.. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడినే.. నాకు అన్నీ తెలుసు అన్నాడు. దీని వల్ల నేను నష్టపోయింది ఏమీ లేదన్నాడు. సినిమా లీక్‌ అయినా అవ్వొచ్చు.. అత్తారింటికి దారేది ఇంకా పలు హిందీ సినిమాలు లీక్‌ అయితే వాళ్ళు ఏమైనా చేశారా.. మనం జాగ్రత్తలు తీసుకుంటాం.. అంతకు మించి మన చేతుల్లో ఏమీ లేదు అన్నాడు.

శ్రీరెడ్డి గురించి మాట్లాడిన వర్మ.. ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డితో మాట్లాడలేదు. పరాన్నజీవి సినిమా గురించి తనకు తెలియదని.. ఎవరో సినిమా తీస్తే నాకెందుకు అన్నాడు. ఇక ‘పవర్‌ స్టార్‌’ ట్రైలర్‌ ట్రెండింగ్‌లో ఉండటానికి పవన్‌ ఫ్యాన్స్‌ ఓ కారణమని అన్నాడు. పవర్‌స్టార్‌లోని పాత్రల గురించి సినిమాలోనే చూడాలి అన్నాడు. కత్తి మహేష్‌ ఏమోగానీ.. నేను మాత్రం పవన్‌కు వ్యతిరేకం కాదు.. ఆయనకు నేను వీరాభిమానిని అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏడాది వరకు సినిమా థియేటర్స్‌ ఓపెన్‌ కావు. అవి వస్తే అప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమాలు తీస్తాను అన్నాడు. ఇప్పుడు మాత్రం ‘ఆర్జీవీ వరల్డ్‌’లోనే విడుదల అవుతాయి అన్నాడు వర్మ. థియేటర్‌కు ఓటీటీకు పెద్దగా తేడా లేదని తెలిపారు.

పవన్ ఫ్యాన్స్ అటాక్‌ చేస్తే నేనూ చేస్తాను.. నాకూ నోరు ఉంది. వాళ్లకు పనిలేదు అరుస్తారు.. నాకు పని ఉంది నేను అరవను అన్నాడు. కంటెంట్‌ లేకపోతే ప్రేక్షకుడు సినిమా ఎందుకు చూస్తాడు. కథ నచ్చకపోతే డబ్బులు ఎందుకు పెడతాడు. నాకు ఇష్టం వచ్చిన రేటు నేను పెడతాను ఇష్టమైతే చూస్తాడు లేకపోతే లేదు. నన్ను చూసి ఫాలో అయ్యేవారు గొర్రెలు మాత్రమే.. గొర్రెలు మాత్రమే ఒకర్ని ఫాలో అవుతాయి. ఎవరికి వాళ్లు సొంతంగా రావాలి అన్నాడు. అజయ్‌ భూపతి తనకు తానే సొంతంగా గుర్తింపు
తెచ్చుకున్నాడు. నేను అతడిని తొక్కేయలేదు. టాలీవుడ్డే పక్కన కూర్చుంది. ఇక నన్ను పక్కన పెట్టేదేముంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పనిచేసేది నేను ఒక్కడినే.. నేను ఏమైనా వస్తువునా.. పక్కన పెట్టడానికి అంటూ తనపై విమర్శించే వారి గురించి ఎవరి ఇష్టం వారిది.. ఎవరి నోరు వారిది అన్నాడు. రాజకీయ నాయకులపై ఎవరో ఒకరు కార్టూన్లు వేస్తారు, తిడుతుంటారు అవి వాళ్లు పట్టించుకుంటారా అన్నాడు. ఇక చివరిగా నా సినిమా చూస్తే చూడమనండి.. లేకపోతే మానేయండి.. నేను 20 సంవత్సరాలుగా పబ్లిసిటీ కోసమే బతుకుతున్నాను అన్నాడు వర్మ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!