మెగాస్టార్‌ కోసం సల్మాన్‌ ఏం చేశాడో తెలుసా!

మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా కోసం బరువు తగ్గి మరింత ఫిట్ అవ్వాలనుకుంటున్నారు. అందుకోసం ఫిట్నెస్ ట్రైనర్ కోసం వెతుకులాట స్టార్ట్ చేశాడు . తనకు సరైన ట్రైనర్ ను తెచ్చిపెట్టే భాద్యతను కొడుకు మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ చేతిలో పెట్టారట. దీంతో చరణ్ నేరుగా తన ఫ్యామిలీ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను సంప్రదించి నాన్నకు ట్రైనర్ కావలి, ఎవరినైనా సజెస్ట్ చేయండి అని అడిగారట. వెంటనే సల్మాన్ తనకు బాగా తెలిసిన ట్రైనర్ ఒకరిని చిరంజీవి కోసం హైదరాబాద్ పంపారట. అతని పర్యవేక్షణలోనే చిరు వర్కవుట్స్ స్టార్ట్ చేశారట. ఇకపోతే ఈ 152వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నారు.