
Salman Khan Social Life:
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర భద్రతా ముప్పులకు గురవుతున్న విషయం తెలిసిందే. 2018లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చిన బెదిరింపుల తర్వాత ఆయన బహిరంగంగా కనిపించడం చాలా తగ్గించారు. షూటింగ్‌లు, ప్రమోషన్‌లకే పరిమితమైన ఆయన లైఫ్‌స్టైల్ గురించి ఇటీవల ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో సల్మాన్ మాట్లాడారు.
షో హోస్ట్ కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు స్పందించిన సల్మాన్, “నాకు బయటకు వెళ్లే అవకాశం పెద్దగా ఉండదు. కానీ అదే కావాలంటే మీ దగ్గర ఉన్న ప్రతిదాన్నీ త్యాగం చేయాలి. బయట తిరగండి, మీకు నచ్చినది చేయండి – కానీ మీ జీవితాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది” అని అన్నారు.
అయితే, సల్మాన్ తన లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడతానని కూడా చెప్పారు. “నేను షూట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తాను. ఎయిర్‌పోర్ట్ – హోటల్ – షూట్ – తిరిగి హోటల్ – మళ్లీ ఎయిర్‌పోర్ట్ – ఇంటికి. గత 35 ఏళ్లుగా ఇదే నా జీవితం” అని వివరించారు.
2018లో బ్లాక్‌బక్ కేసులో కోర్టు విచారణ సందర్భంగా లారెన్స్ బిష్ణోయ్, సల్మాన్‌ను హత్య చేస్తానని బెదిరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బెదిరింపులు వరుసగా వస్తూనే ఉన్నాయి. 2024 ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ముంబై బాంద్రాలోని నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. వీరిద్దరూ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారని పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటన తర్వాత సల్మాన్‌కు ఇచ్చే భద్రత మరింతగా పెంచారు. ఆయన ఇంటి బాల్కనీకి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్, అదనపు CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్‌కి ఇలాంటి భద్రత అవసరమవుతుండటం చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయినా సరే, ఆయన ఎప్పటిలానే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో తడపడడం లేదు!
ALSO READ: Mega 157 లో చిరంజీవి పాత్ర ఇదేనా?













