సమంతకు కరోనా భయం.. ఆందోళనలో ఫ్యాన్స్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అక్కినేని సమంతకు, ఆమె భర్త నాగచైతన్యకు కరోనా సోకిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం ఏమిటంటే.. సమంత తాజాగా తన ఫ్రెండ్‌, పాపులర్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి బుగ్గపై గట్టిగా ముద్దు పెడుతున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ ఫొటో షేర్‌ చేసిన కొద్ది రోజులకే శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో సమంత, నాగచైతన్య ఆరోగ్యపరిస్థితి గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సమంత ఈ పోస్ట్‌ చేసిన ఫోటో పాతదా లేక తాజాగా తీసుకున్న ఫొటోనా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ విషయంపై అభిమానులు క్లారిటీ కోసం ఎదురు చుస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates