మహిళా క్రికెట్ కెప్టెన్ పాత్రలో సమంత!

ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో కనిపించిన సమంత రీసెంట్ గా సావిత్రి బయోపిక్ లో నటించడానికి అంగీకరించింది. ఇప్పుడు మరో బయోపిక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. దక్షిణాది భాషల్లో
ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించడానికి సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సమంత తన పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతోంది.

పలు సినిమాలతో బిజీగా ఉన్న సమంతా పెళ్లి తరువాత కూడా నటిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె పెళ్లి
అనంతరం నటించబోయే సినిమా ఈ బయోపిక్ అని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.