
అక్కినేని నాగచైతన్య- సమంత రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం టాలీవుడ్‌లో పెద్ద చర్చ అయింది. ది బెస్ట్ పేయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట పెళ్లయిన నాలుగేళ్లకు విడిపోయారు. ఇక వీరిద్దరూ విడిపోయి రెండేళ్లయినా ఇప్పటికీ .. వీరి గురించిన వార్తలు ఏదో సందర్భంలో వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు విడాకుల గురించి స్పందించని నాగ చైతన్య తొలిసారిగా దాని గురించి మాట్లాడాడు.
సమంత చాలా మంచి అమ్మాయని, పెళ్లయ్యాక చాలా రోజులు తాము హ్యాపీగా ఉన్నామని చెప్పాడు. సామ్‌తో కలిసి ఉన్నన్ని రోజులు ఆమెను చాలా గౌరవంగా చూశానని చెప్పాడు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులే తమ విడాకులకు కారణమయ్యాయని చెప్పాడు.
ఇక చైతన్య చేసిన ఈ కామెంట్స్‌కు సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రియాక్ట్ అయింది. ‘మనమంతా ఒక్కటే.. కేవలం అహంకారం, నమ్మకాలు, భయాలు మనల్ని దూరం చేస్తాయి’ అంటూ ఓ కొటేషన్‌ను సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అలాగే మరో వీడియోను కూడా సమంత షేర్ చేసింది.
సైకిల్ తొక్కుతూ ఓ పిల్లాడు పడిపోవడం, కానీ వెంటనే లేచి డ్యాన్స్ చేయడం అందులో కనిపించింది. ‘జీవితం నిన్ను సవాలు చేసినప్పుడు.. నీ ప్రతిస్పందన ఇలానే ఉండాలి’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. చైతు కామెంట్స్ అనంతరం సమంత ఇలా పోస్ట్ చేయడంతో వీళ్లిద్దరు కేవలం ఈగోల కారణంగానే విడిపోయి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













