సమంత బాలీవుడ్‌ ఎంట్రీ

సౌత్‌ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో బాలీవుడ్ లో హీరోయిన్ గా మారబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్కినేని నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత మౌనంగా ఉంది. ఈ మధ్య త‌న‌కి సంబంధించి ఎన్నో రుమార్స్‌ సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్న నేప‌థ్యంలో అవ‌న్నీ రూమ‌ర్స్ చెబుతూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే శాకుంత‌లం చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సామ్ త‌మిళ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉంది. తాజాగా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంకి కూడా హాజ‌రైంది.

స‌మంత‌ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయనే టాక్ తాజాగా వినిపిస్తోంది. అవి ఏయే భాషలకు సంబంధించిన సినిమాలనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ త‌ర్వాత స‌మంత‌కు బాలీవుడ్ ఆఫ‌ర్స్ బాగా వ‌స్తున్నాయ‌ట‌. సామ్ ఇటీవల ఒక బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

కథ ఓకే అవ్వడంతో సామ్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక పెద్ద సినిమాతోనే సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా అన్ని పూర్తి అయ్యాయి.

CLICK HERE!! For the aha Latest Updates