HomeTelugu Trending'బంగార్రాజు'కు విలన్‌గా సముద్రఖని

‘బంగార్రాజు’కు విలన్‌గా సముద్రఖని

Samuthirakani as villain in

కింగ్‌ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. ఈ పేరు వినగానే ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో పల్లెటూరి వ్యక్తిగా నాగార్జున రూపం గుర్తుకు వస్తుంది. అంతగా ఆ పాత్ర జనంలోకి వెళ్లింది. అప్పటి నుంచి ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా చేయడానికి నాగార్జున ఉత్సాహం చూపుతూనే వస్తున్నాడు. అయితే కథ సెట్ కావడానికే చాలా సమయం పట్టింది. ‘బంగార్రాజు’ కథపైనే దర్శకుడు కల్యాణ్ కృష్ణ చాలా కాలంగా కసరత్తు చేస్తూ వచ్చాడు. చివరికి నాగార్జుని మెప్పించాడు. దాంతో నాగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల నాగార్జున చెప్పారు. ఈ సినిమాలో నాగార్జున జంటగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక ఒక యువ జంట కూడ ఈ సినిమాలో సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ సినిమాలో విలన్‌ ఎవనే అనే ఆసక్తి ఫ్యాన్స్‌ మొదలైంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో ‘సముద్రఖని’ కనిపించనున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!