అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీనియర్‌ నటుడు!


సీనియర్ నటుడు కార్తీక్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంత కాలం క్రితమే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన.. ఆ తర్వాత కోలుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్తీక్.. మరోసారి అనారోగ్యం పాలయ్యారు. నటుడిగా వెండితెరపై తనదైన ముద్రవేసిన కార్తీక్.. సొంతంగా పార్టీని కూడా ప్రకటించారు. ఆ తరువాత.. అనారోగ్యం వేధించడంతో కొంతకాలానికే పార్టీని రద్దు చేశారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. ఆ పార్టీ తరపున ప్రచారంలోకి కూడా దిగారు.

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ఆయన.. ఈ సోమవారం ప్రచారం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అడయార్ లోని ఓ ప్రైవేటు దవాఖానాలో ఆయన చేర్పించారు. కార్తీక్ శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. తాజాగా రక్తపోటుకూడా ఎక్కువైందని అందుకే అస్వస్థతకు లోనయ్యారని వైద్యులు చెప్పినట్టు తెలిసింది. కాగా.. గత నెల 21న కూడా ఆసుపత్రిలో చేరారు కార్తీక్. ఆ తర్వాత డిశ్చార్జ్ చేసిన డాక్టర్లు.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ.. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో మళ్లీ జబ్బుచేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates